బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దే!- రేవంత్ రెడ్డి.

-

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యకుడు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను విమర్శిస్తూ.. మరో ట్విట్ పెట్టారు. బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితంలా మార్చిన ఘనత కేసీఆర్ దే అని విమర్శించారు. బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు… విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు అంటూ.. ట్విట్ చేశారు. revanth-reddy-cm-kcr

నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి బానిసలుగా పనిచేస్తున్నారని.. డీజీపీ కనీసం నేను కూడా ఫోన్ చేసిన స్పందించడం లేదని.. తమ కార్యకర్తలను తీసుకువెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారని.. ఇంతకన్న బ్రోతల్ పని చేసుకుంటే మంచిగా ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించినప్పడే తెలంగాణకు విముక్తి అన్నారు. మా రాజ్యం వస్తుందని.. లెక్కకు లెక్క చూసుకుంటామని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news