తక్కువ వడ్డీకే సొంతింటి కల సాకారం చేసుకోండి ఇలా..!

ఇప్పటికే అనేక బ్యాంకులు వడ్డీ రేట్లలో కోతలు విధించాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బ్యాంకులు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. చాలా బ్యాంకులు తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. పండుగ సమయంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఇదొక శుభవార్త. అయితే అన్నిబ్యాంక్స్ కన్నా ఒక సంస్థ మరింత తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. చౌక వడ్డీకే రుణాలు ఇస్తూ కస్టమర్లుకు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది టాటా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ.

 

ఈ సంస్థ కస్టమర్లుకు చాలా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. ఈ సంస్థ దగ్గర హోమ్ లోన్స తీసుకునే వారు కేవలం 3.99 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. ఇలా సంవత్సరం పాటు చెల్లిస్తే మిగతా భారాన్ని కంపెనీనే భరిస్తుంది. అయితే నవంబర్ 20 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అది కూడా కేవలం 10 ప్రాజెక్టులకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తుంది. ఇదే కాకుండా తమ కస్టమర్లకు గిఫ్ట్ వోచర్లు కూడా లభిస్తాయి. రూ.25,000 నుంచి రూ.8 లక్షల వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మొత్తంలో కేవలం10 శాతం చెల్లిస్తే చాలు.. ఈ వోచర్లు కస్టమర్లకు అందుతాయి. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆకాంక్షించే వారందరు త్వరపడండి. అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇంకా రూ.8 లక్షల వరుకు తగ్గింపు పొందే సువర్ణావకాశం పొందవచ్చు. వచ్చే నెల నవంబర్ 20 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

ఇకపోతే ఈ పండుగ సీజన్‌లో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంక్స్ ఇప్పటికే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లును కొంత మేర తగ్గించాయి. దీనికి ప్రధాన కారణం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో వడ్డీ రేట్లను తగ్గించడమే.