టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఇటీవలే వీవోవైఫై (వైఫై కాలింగ్) సేవలను ప్రారంభించిన విషయం విదితమే. అయితే ఈ సేవలు కేవలం పలు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లలోనే యూజర్లకు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ తన ఫోన్లకు వీవోవైఫై సేవలను అందిస్తూ వస్తోంది. అందుకు గాను ఆయా కంపెనీలు తమ ఫోన్లకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఇక రియల్‌మి కూడా తన కంపెనీకి చెందిన రెండు ఫోన్లకు గాను తాజాగా వీవోవైఫై అప్‌డేట్‌ను విడుదల చేసింది.
రియల్‌మికి చెందిన రియల్‌మి 2 ప్రొ, రియల్‌మి సి2 ఫోన్లకు గాను ఆ కంపెన తాజాగా నూతన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను విడుదల చేసింది. వీటిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తోపాటు ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఫోన్లు ఉన్నవారు తమ ఫోన్లను నూతన సాఫ్ట్‌వేర్‌కు అప్‌డేట్ చేసుకుంటే దాంతో ఆయా ఫోన్లలో వారు వీవోవైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇక ఇప్పటికే ఆపిల్, శాంసంగ్, షియోమీ సహా పలు కంపెనీలకు చెందిన ఫోన్లలో వీవోవైఫై సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.