కొడుక్కి జ్వరం వస్తే, కరోనా అనుకుని భార్యను పుట్టింటికి పంపించేసాడు…!

139

ఒకవైపు కరోనా వైరస్ ప్రభావం తో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. మరో వైపు కరోనా పట్ల ప్రజలలో లేనిపోని భయాలు నెలకొన్నాయి. ఇది చెయ్యాలన్నా అందరిని కరోనా భయం వెంటాడుతుంది. కరోనా వైరస్ గురించి అవగాహన లేకపోవడంతో చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్తితులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల కరోనా భయం తో కుటుంబ సభ్యుల నుంచే సమస్యలను ఎదుర్కొంటున్నారు.

సరిగ్గా ఇటువంటి సంఘటనే బుధవారం ఒకరి ఇంట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడికి చెందిన కుండ్ల రాజారెడ్డి, లక్ష్మి దంపతుల సంతానం సంజీవరెడ్డి. సంజీవరెడ్డి మూడవ తరగతి చదువుతున్నాడు. నాలుగు రోజులుగా ఈ పిల్లాడు టైఫాయిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. అయితే రాజారెడ్డి కొడుకుకు వచ్చింది కరోనా వైరస్ అనే అపోహతో,

భార్యను కొట్టి కొడుకుతో పుట్టింటికి పొమ్మని ఇద్దర్ని ఇంట్లో తరిమేశాడు. దీనితో ఏం చేయాలో తోచని ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన స్థానిక ఎస్సై బాలుడికి పరీక్షలు నిర్వహించారు. దాంతో ఆ బాలుడికి వచ్చింది కేవలం జ్వరం మాత్రమే అని నిర్దారించారు. తన కొడుకు సంజీవ రెడ్డి కి వచ్చింది కేవలం జ్వరం మాత్రమే అని కరోనా కాదు అని వివరించి పోలీసులు రాజారెడ్డి తో మాట్లాడి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.