క‌రోనా క‌లవ‌రం :  ఏపీలో సీన్ రివ‌ర్స్‌… ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్పిందా..?

-

క‌రోనా ఎఫెక్ట్ ఏపీని మ‌రింత‌గా తాకిందా?  ఇక్క‌డ ప‌రిస్థితి కేవ‌లం రెండు వారాల్లోనే అదుపు త‌ప్పుతోందా? అంటే.. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో రోజు రోజుకు కూడా ఈ వైర‌స్ తీవ్ర‌త పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,097కు చేరింది. గత 24 గంటల్లో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 31మంది మృతి చెందగా 231మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 835 ఉన్నట్లు నిర్ధారించారు. గత 24గంటల్లో అత్యధికంగా కృష్ణాలో 52 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి.

అదేవిధంగా పశ్చిమగోదావరిలో 12, కర్నూలులో 4, ప్రకాశంలో 3, కడపలో 3, గుంటూరులో 3, తూర్పు గోదా వరిలో 2, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజి టివ్‌ కేసులు మొత్తం.. అనంతపురం 53, చిత్తూరు 73, తూ.గో. 39, గుంటూరు 214, కడప 58, కృష్ణా 177, క ర్నూలు 279, నెల్లూరు 72, ప్రకాశం 56, శ్రీకాకుళం 3, విశాఖ 22, ప.గో. 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై యినట్లు నిర్ధారించారు. వాస్త‌వానికి  ఈ ప‌రిస్థితి కేవ‌లం ప‌దిహేను రోజుల కింద‌ట వేరేగా ఉంది. కేసుల తీవ్ర‌తలోను, మ‌ర‌ణాల్లోనూ కూడా ఏపీ చాలా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచింది.

అయితే, అనూహ్యంగా ఈ కేసులు పెరిగిపోవ‌డం,మ‌ర‌ణాలు కూడా పెరిగిపోవ‌డం వంటివి గ‌మ‌నిస్తే.. ఏపీ లో ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ జాతీయ స్థాయిలో జ‌రుగుతోంది. నిజానికి ఏపీ ప్ర‌భుత్వం ముందుగానే వ‌లంటీ ర్ల‌ను అలెర్ట్ చేసి.. యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. డిల్లీ నుంచి వ‌చ్చిన వారిని క్వారంటైన్ చేసిం ది. ఇక‌, ముందు జాగ్ర‌త్త‌గా మందుల పంపిణీ చేప‌ట్టింది. మాస్కులు పంచింది. అయినా కూడా ఈ రేం జ్‌లో క‌రోనా వ్యాప్తి చెందడం వంటిది తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌రోనా వ్యాప్తి పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌భుత్వం లాక్‌డౌన్ వెసులుబాటు ఇవ్వ‌డంతో ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. వీరికి పోనీ భౌతిక దూరం పాటిస్తున్నారా? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. ఇక మాస్కులు కూడా ఇష్టానుసారిగా ధ‌రిస్తున్నారు. దీంతో వ్య‌క్తుల మ‌ధ్య గ్యాప్ త‌గ్గి .. క‌రోనా వ్యాప్తికి అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు వైద్య నిపుణులు. ఇటీవ‌ల కొన్ని రాష్ట్రాల‌ను ప‌రిశీలిస్తే.. లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమ‌లు చేసిన ప‌రిస్థితి ఉంది. అదేవిధంగా ఏపీలోనూ ఇవే త‌ర‌హా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ఆదిశ‌గా ఆలోచిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news