దాదాపు 70 సంవత్సరాలుగా ఎంతో వివాదంగా ఉన్న అయోధ్య కేసులో ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించింది. అయోధ్యలో ఖాళీ ప్రదేశంలో మసీదు కట్టలేదని సిజెఐ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. పురావస్తు పరిశోధనల ప్రకారం చూస్తే 12 శతాబ్దంలోనే అక్కడ ప్రార్థనా స్థలం ఉందని ఆయన అన్నారు. అయితే అది ఆలయం చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన చెప్పారు.
పురావస్తు పరిశోధనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. అక్కడి నిర్మాణం ఇస్లాం సంప్రదాయానికి అనుకూలంగా లేదని పురావస్తు శాఖ నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. ఇక పురావస్తు శాఖ కోర్టుకు సమర్పించిన ఆధారాలను బేస్ చేసుకునే కోర్టు తన తీర్పు వెలువరించింది.
ఇక గతంలో అలహాబాద్ హైకోర్టు వివాస్పద 2.77 ఎకరాలను ముగ్గురికి పంచాలన్న తీర్పును తోసిపుచ్చింది. ఇక అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొంది.