రుణాలు తీసుకోవడానికి క్రెడిట్ స్కోర్ ఎంత ముఖ్యమో మనందరికి తెలుసు. గతంలో మనం తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపుల ఆధారణంగా..క్రెడిట్ స్కోర్ లెక్కిస్తారు. అయితే కొందరికి ఇది తక్కువగా ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అవి మనకు అసలు తెలియదు కూడా. ఈరోడు..క్రిడిట్ స్కోర్ తక్కువ ఉండటానికి కారణాలు ఏంటి, పెంచుకోవటం ఎలానో చూద్దాం.
క్రెడిట్ స్కోర్ ప్రధానంగా మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది. మీరు తీసుకున్న లోన్స్ కి సంబంధించి ఈఎంఐ చెల్లింపులు క్రెడిట్ నివేదికపై బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. రుణాలకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించడం మర్చిపోయి, డీఫాల్టర్‌గా మారకుండా ఉండడానికి, మీ ఈఎంఐలకు రిమైండర్ పెట్టుకోవడం మంచిది. ఇందుకోసం ‘ఆటో- డెబిట్’ సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం మీ బ్యాంకు ఖాతా నుంచి రుణదాత ఖాతాకు బదిలీ అవుతుంది. దీనివ్లల మర్చిపోయే ఆప్షన్ ఉండదూ. ఈరోజుల్లో చాలామంది ఆటోడెబిట్ ఆప్షన్ నే ఎంచుకుంటున్నారు. అయితే మీరు ఆ తేదీలోగా..నిర్థిష్ట ఎమౌంట్ ను ఖాతాలో ఉంచుకోవాలి.
*ఇక క్రెడిట్ కార్డ్ వినియోగం అయితే ఎక్కుగా మీ క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్టు చూపుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను సమర్థంగా నిర్వహించడంలో మీ సామర్థ్యాన్ని చూపుతుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డులను సమర్థంగా నిర్వహించడంలో విఫలమైనట్లయితే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ అంతా వాడేసినా..క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. అంటే.. బ్యాంకు మీరు ఎక్కువగా డబ్బును వినియోగించేవారిని అంచనా వేస్తుందన్నట్లు.
ఒకవేళ రుణం లేదా క్రెడిట్ కార్డుల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసినట్లయితే, మీరు నిర్వహించే దాని కంటే ఎక్కువ క్రెడిట్‌ను పొందాలనుకునే వ్యక్తిగా మిమల్ని బ్యాంకు పరిగణిస్తుంది. అందువల్ల మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు, దానికి మీరు అర్హులా కాదా అనే విషయాన్ని ఆలోచించి..అప్పుడ్డు అప్లైయ్ చేసుకోండి. మన ఎలిజిబిలిటీని చూసుకోకుండా వెంటనే అప్లైయ్ చేస్తే..అది రాకపోగా..మనకే స్కోర్ పడిపోతుంది.
ఒకవేళ మీ క్రెడిట్ రిపోర్టులో తప్పులు ఉన్నట్లయితే, అది కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్పుడు మీరు అధికారిక క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి, మీ క్రెడిట్ నివేదికల్లో ఉన్న లోపాలను వారికి వివరించి వాటిని సరిదిద్దుకోవాలి. కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలోని వివరాలు, ఖాతా బ్యాలెన్స్ వంటి తప్పుడు సమాచారం వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.
ఒకవేళ మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ లేకపోయినా, రుణాలు కూడా తీసుకోకుండా ఉన్నట్టయితే మీకు క్రెడిట్ స్కోర్ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డు తీసుకుని, వాటి బిల్లుల్ని సరైన సమయానికి చెల్లిస్తూ ఉండాలి. తద్వారా క్రెడిట్ స్కోర్ కొద్దికొద్దిగా పెరుగుతూ ఉంటుంది.
మంచి క్రెడిట్ స్కోర్ ని మెయింటేన్ చేయాలంటే..క్రెడిట్ కార్డును వాడాలి.అయితే..మరీ ఎక్కువగా వాడొద్దు. ఒక లిమిట్ వరకూ వాడుతూ..బిల్ ని డ్యూడేట్ లోపే చెల్లించాలి. చాలామంది క్రెడిట్ కార్డులో తీసుకున్న ఎమౌంట్ కి ఈఎంఐ లో కన్వర్ట్ చేస్తుంటారు. లేదా మినిమన్ డ్యూ చెల్లిస్తుంటారు. ఇలా చేయటం అన్ని సార్లు మంచిపద్దతి కాదు.