అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళకి ఉంటుంది. పెళ్లి అయిన ప్రతి ఒక్కరు కూడా తల్లి అవ్వాలని కోరుకుంటుంటారు తల్లి కావడం అనేది ప్రతి ఒక్క స్త్రీ కల. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ ఈ శుభవార్తను వినడానికి చూస్తూ ఉంటారు. అయితే అందరికీ అంత అదృష్టం కలగదు కొంతమందిలో సంతానోత్పత్తి ఆలస్యం అవ్వచ్చు లేకపోతే అసలు ఎప్పటికీ రాకపోవచ్చు. నిజానికి ఈ సమస్యలు ఉండడం వలన ప్రెగ్నెన్సీకి ఆటంకం రావచ్చు. మరి ఎలాంటి సమస్యల వలన తల్లి అవ్వలేకపోతుంటారు గర్భిణీ కాలేకపోతుంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో పీసీఓస్ ఒకటి. ఈ సమస్య కారణంగా పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. కొంతమంది అమ్మాయిలు థైరాయిడ్ తో బాధపడుతూ ఉంటారు థైరాయిడ్ ఉంటే కూడా సంతాన ఉత్పత్తి సామర్థ్యం పై ప్రభావం పడుతుంది కాబట్టి డాక్టర్ని కన్సల్ చేయడం మంచిది. అండాశయానికి సంబంధించి లోపాలు ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాదు. సంతానలేమికి కారణం అవుతుంది. ఈ సమస్య ఉంటే కూడా గుర్తించి సరైన వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. గర్భాశయం వెలుపలి టిష్యూలో కనపడే మార్పుని ఎండోమెట్రీయాసిస్ అంటారు ఇది కూడా సంతాన ఉత్పత్తిని ఆలస్యం చేస్తుంది.
అధిక బరువు సమస్యను కూడా చాలామంది మహిళలు ఎదుర్కొంటుంటారు. అధిక బరువు కారణంగా మహిళలు ప్రెగ్నెన్సీని పొందలేకపోతూ ఉంటారు ఈ రోజుల్లో చాలా మంది మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం మానేశారు. జంక్ ఫుడ్ వంటి వాటి వల్ల సులభంగా బరువు పెరిగిపోతున్నారు ఇది కూడా ప్రెగ్నెన్సీ పై ప్రభావం చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలకి స్మోకింగ్ అలవాటు ఉంటోంది. ఇది కూడా సంతాన ఉత్పత్తి సమస్యలను కలిగించవచ్చు జాగ్రత్త.
వయసు వలన కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. వయసు కీలకం. 35 ఏళ్లు వయసు దాటితే ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు కలుగుతాయి. ఆల్కహాల్ ని తీసుకోవడం వలన కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వచ్చు. ప్రెగ్నెన్సీని పొందాలనుకునే మహిళలు మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం, మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం, అనారోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవడం, చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండడం చాలా అవసరం.