చేవెళ్ల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరం అన్నారు. దేశంలో రక్తపాతం సృష్టించి పాలన సాగించాలన్న చందంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో బాధ, భయం రెండూ కలుగుతున్నాయి అన్నారు.
జన గణన చేయకుండా బిఆర్ఎస్, బిజెపి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల పైన మాట్లాడి గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ స్నేహభావంతో అందరినీ కలుపుకొని పోయేలా చూసుకుంటూ వచ్చిందన్నారు. ఇలా ప్రశాంతంగా ఉన్న భారతదేశంతో పాటు తెలంగాణలో అల్లకల్లాలం చేసేలా అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆటలను తెలంగాణలో సాగనివ్వం అన్నారు భట్టి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పైన చర్యలు తీసుకుంటామన్నారు.