భారత దేశం మరో ఘనతను అందుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150 కోట్ల డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ రికార్డు సృష్టించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రపంచంలో టీకాలు పంపిణీ చేయడంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రకటించారు.
అలాగే అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించామని అన్నారు. అంతే కాకుండా దేశంలో 18 ఏళ్ల వయస్సు ఉన్న వారు దాదాపు 90 శాతానిక పైగా మంది వ్యాక్సిన్ ను తీసుకున్నారని తెలిపారు. అలాగే జనవరి మూడు నుంచి నిర్వహిస్తున్న 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. జనవరి 3 నుంచి ఇప్పటి వరకు 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు దాదాపు 1.5 కోట్లకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ప్రకటించారు. అలాగే తన ట్విట్టర్ ద్వారా ఈ సమాచారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ట్యాగ్ చేశారు.
🇮🇳 continues to be world leader in driving the largest vaccination drive with over 150 crore #COVID19 vaccinations.
90% of our adult population vaccinated with the COVID-19 vaccine dose.
Over 1.5 crore children vaccinated against COVID-19 since 3rd January: PM @NarendraModi Ji pic.twitter.com/dCK4tFfxYH
— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) January 7, 2022