తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు అన్ని జిల్లాల అధికారులతో వర్చవల్ గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ పై అధికారులను అందరినీ మంత్రి హరీష్ రావు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని అన్నారు.
థర్డ్ వేవ్ ను ఎదుర్కొవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొవడానికి రాష్ట్రంలో అన్ని మున్సిపల్, పంచాయతీలలో శాఖలలో ఉన్న సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులను కూడా ఉపయోగించు కోవాలని సూచించారు. 60 ఏళ్ల పైబడిప వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోసు పంపిణీ వేగంగా చేయాలని అన్నారు. అలాగే 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి టీకా పంపిణీ కూడా వేగంగా జరగాలని ఆదేశించారు. అలాగే ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకునేలా చూడాలని అన్నారు. అలాగే స్థానికంగానే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందుకు ప్రజా ప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు.