మరోసారి ₹1.50 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

-

దేశంలో జీఎస్టీ వసూళ్లు మరోసారి బాహుబలి రికార్డ్ట్స్ సాధించాయి. అక్టోబర్‌ నెలకు గానూ రూ.1,51,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.26,039 కోట్లు.. ఎస్‌జీఎస్టీ కింద రూ. 33,396 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. రూ.10,505 కోట్లు సెస్సుల రూపంలో వసూలైనట్లు చెప్పింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 16.6 శాతం మేర పెరిగాయని.. గతేడాది ఇదే సమయంలో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయని పేర్కొంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీలో గతేడాది ఇదే నెలలో రూ.2,879 కోట్లు వసూళ్లు జరగ్గా.. ఈ ఏడాది రూ.3,579 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 24% వృద్ధి నమోదైంది. తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లో రూ.3,854 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం అధికంగా రూ.4,284 కోట్ల వసూళ్లు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర ఈ విషయంలో ముందుంది.

Read more RELATED
Recommended to you

Latest news