BREAKING : మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి చోటు చేసుకుంది.
ఎల్లుండి మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే… బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ పార్టీ నేతలు రాళ్ల దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. మునుగోడు మండలం పలివెలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ సంఘటనలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులకు గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తతంగా ఉంది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.