వందేళ్ళలోనే అమెరికాలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత…!

-

కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలోని డెత్ వ్యాలీ వద్ద ఆదివారం మధ్యాహ్నం గత వందేళ్ళలో లేని విధంగా ఉష్ణోగ్రత నమోదు అయిందని అక్కడి ప్రహుత్వం ప్రకటించింది. 130 ఫారెన్‌హీట్ (54.4 సెల్సియస్) గా ఉంది అని పేర్కొంది. లోయలో తక్కువ జనాభా ఉండే ఫర్నేస్ క్రీక్‌లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. తేమ అక్కడ 7 శాతానికి పడింది అని వాతావారణ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ పరిణామం చాలా వేడిగా ఉంది అని వారు వెల్లడించారు. పర్యాటకులు సోమవారం డెత్ వ్యాలీ సందర్శకుల కేంద్రంలో బహిరంగ థర్మామీటర్ ద్వారా సెల్ఫీలు తీసుకున్నారు. అయితే అక్కడ కార్చిచ్చు కారణంగానే ఈ ఉష్ణోగ్రత నమోదు అయిందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో వేసవి కాలం నడుస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉష్ణోగ్రతలు ఆ దేశం చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news