Telangana : 11 వేల గురుకుల పోస్టుల భర్తీలో జాప్యం .. ఆందోళనలో నిరుద్యోగులు

-

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే గురుకులాల్లో టీజీటీ నుంచి డిగ్రీ గురుకుల ప్రిన్సిపల్‌ కేటగిరీ వరకు 11 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. నెలలు గడుస్తున్నా ఇంకా ప్రకటనల రూపం దాల్చలేదు.

సంక్షేమ గురుకులాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు గురుకుల నియామక బోర్డు ప్రక్రియ పూర్తి చేసినా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పేరిట నిలిచిపోయాయి. ప్రస్తుతం కోడ్‌ తొలగిపోయినా ప్రభుత్వం నుంచి అనుమతి పేరిట గురుకుల బోర్డు జాప్యం చేస్తోంది. దీంతో లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడంలేదు.

సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా ఉంది. 9 నెలల కిందటే 9,096 పోస్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ రోస్టర్‌, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గురుకుల సిబ్బంది సర్దుబాటు కారణాలతో ఆలస్యమైంది.

Read more RELATED
Recommended to you

Latest news