మనం ఎంత సంపాదించినా కూడా చేతిలో చేతిలో చిల్లి గవ్వ లేదు అంటూనే ఉంటారు.. అందుకు కారణం శని ప్రభావం అంటున్నారు.మీ ఇంటిపై శని ప్రభావం పడింది అని మీరు గ్రహించినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు.
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం శమీ మొక్క ఇంట్లోనీ అనేక రకాల సమస్యలను తొలగిస్తుందని నమ్ముతారు. అయితే ఈ మొక్కను ఇంట్లో సరైన స్థలంలో నాటడం చాలా ముఖ్యం. ఈ మొక్క సానుకూలతను ఆకర్షిస్తుంది మరియు శనికి సంబంధించినది కాబట్టి ఈ మొక్కను శమీ అనే పేరుగా రూపొందించింది…
ఇలాంటి చెట్లు చాలానే ఉన్నాయి.వీటిని పూజనీయంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ చెట్లు మరియు వాటిని పద్ధతిగా పూజించడం ద్వారా ఫలాలు కూడా లభిస్తాయి. ఈ మొక్కలలో శమీ మొక్క ఒకటీ. హిందూ మతంలో ఈ మొక్కను శనివారం పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి. శేమి మొక్కను పురాతన కాలం నుండి హిందూ మతంలో వివరించబడింది. ఈ మొక్క రామాయణం మరియు మహాభారతం వంటి గ్రంథాలలో మతపరమైన, పౌరాణిక రూపంలో శమీ మొక్కను ప్రత్యేకంగా భావిస్తారు..
అలాంటి మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఎన్నో దోషాలు పోతాయి..ఇంట్లో ఏ రోజు శమీ మొక్కను నాటాలనే విషయం పైన హిందూ మత గ్రంథాలలో ఎలాంటి ప్రస్తావన లేదు. ఇంట్లో ఏరోజైనా నాటుకోవచ్చు కానీ శనివారం రోజున శమీ మొక్కను ఇంటికి తెచ్చుకుంటే శని దోషం తొలగిపోతుందని పురాణాలలో కూడా చెప్పబడింది. ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.. శమీ మొక్కను నాటేటప్పుడు దిక్కులు చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది.. పండితులను అడిగి మొక్కను నాటడం మంచిది.. శని ప్రభావం పోవడం మాత్రమే కాదు.. ఎన్నో సమస్యలు దూరం అవుతాయి..