త్వరలోనే 6,500 కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తామని ప్రకటించారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంధ్రనాద్ రెడ్డి. నిన్న శ్రీకాకుళంలో డిజిపి కసిరెడ్డి రాజేంధ్రనాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో గతం కంటే క్రైం తగ్గుమొహం పట్టింది…ల్యాండ్ సమష్యల కారణంగా బాడీలీ అపెన్స్ పెరిగిందన్నారు.
బోర్డర్ లో ఇంకా మావో యాక్టివిటీ ఇంకా ఉందని.. టోటల్ జీరో అయిందని చెప్పడానికి లేదని చెప్పారు. ఇంకా బార్డర్ ఏరియాలో , ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలు ఉన్నాయని..ఎలా కంట్రోల్ చేయాలన్నది తెలుసు. మంత్రి అప్పల రాజు కు మావొయిస్ట్ లేఖ అంశం పోలీస్ దృష్టిలో ఉందని వివరించారు.
మావోయిస్ట్ సమష్యపై తగిన చర్యలు తీసుకుంటామని.. అరకు ఏరియాలో గంజాయి సమష్య తగ్గుమొఖం పట్టింది, బట్ ఒడిస్సాలో గంజాయి సాగు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 7500 ఎకరాల్లొ గత ఏడాది గంజాయి పంటను నాశనం చేసామని.. ఈ ఏడాది చాలా తక్కువ ఎకరాలకు పరిమితం అయ్యిందని తెలిపారు.గంజాయి పండించడం , అక్రమరవాణా విశయంలో కఠినమైన కేసులు పెట్టడం వలస కంట్రోల్ అయ్యింది…అరకు ప్రాంతంలో గంజాయికి బదులు , హార్టికల్చర్ సెరికల్చర్ పై అవగాహాన పెట్టిస్తున్నామన్నారు.