రెడ్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన షియోమీ.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 9ఐ ని మంగ‌ళ‌వారం విడుదల చేసింది. ఇందులో 6.53 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్‌ను ఇందులో అమ‌ర్చారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తోంది. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో ఏర్పాటు చేశారు.

Redmi 9i smart phone launched in india

రెడ్‌మీ 9ఐ స్పెసిఫికేష‌న్లు…

* 6.53 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి25 ప్రాసెస‌ర్
* 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

రెడ్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, సీ బ్లూ, నేచ‌ర్ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.8299 ఉండ‌గా, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.9299గా ఉంది. ఈ ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news