రెడ్‌మీ నుంచి Redmi k50i 5G స్మార్ట్‌ ఫోన్..లాంచ్‌కు ముందే లీకైన ఫీచర్స్‌..

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్ Redmi k50i 5Gని త్వరలో లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందే ఫోన్‌ ఫీచర్స్‌ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. చైనాలో గత సంవత్సరం లాంచ్‌ అయిన రెడ్‌మీ నోట్‌ 11టీ ప్రోకు రీబ్రాండెడ్‌ వర్షన్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ కానుందని సమాచారం.రెడ్‌మీ కే50ఐలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నాయి.ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ దీని స్పెసిఫికేషన్లను టీజ్ చేశారు. లీకైన సమాచారంబట్టి ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

Redmi k50i 5G స్పెసిఫికేషన్లు( అంచనా)

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించనున్నారు.
డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉండనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

కెమెరా క్వాలిటీ..

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5080 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉండనుంది. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో కూడా లాంచ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news