Viral Video: తప్పేం లేదు.. ఇలా కూడా ర్యాంప్ వాక్ చెయ్యొచ్చు!

-

కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి సోషల్ మీడియా వాడకం అధికమైంది. చాలా మంది ప్రజలు ఫేమస్ అవ్వాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మిలియన్స్ లో ఫాలొవర్లను సంపాదించుకోవడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. అయితే ఎలా ఫేమస్ అవ్వాలనేదే టార్గెట్. విభిన్నంగా ఉండే వీడియోలకే ఇటీవల వీవ్స్, లైక్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో వెరైటీ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరింపజేస్తున్నారు.

మోడల్ షహీల్ షెర్మాంట్
మోడల్ షహీల్ షెర్మాంట్

అయితే తాజాగా ఓ వ్యక్తి ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ నవ్వించాడు. డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘ఈ రోజుల్లోని ఫ్యాషన్ షో’ అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఈ వీడియో ఏకంగా 14.9 మిలియల్ వీవ్స్, 355.7కే లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన ప్రతిఒక్కరూ చాలా నవ్వుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

మోడల్ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్ ర్యాంప్ వాంక్ చేశాడు. అయితే ర్యాంప్ వాక్‌లో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుని చేస్తారు.. కానీ, షహీల్ ఇంట్లో ఉండే రకరకాల వస్తువులతో ర్యాంప్ వాక్ చేశాడు. అలాగే ఒక అమ్మాయిని ఎత్తుకుని కూడా ర్యాంప్ వాక్ చేయడం అందరినీ నవ్వింపజేసింది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఇలా కూడా ర్యాంప్ వాక్ చెయ్యొచ్చా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news