పొడి దగ్గు తో సతమతమవుతున్నారా…?, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా..? అయితే తప్పకుండా ఈ చిట్కాలను పాటించాలి. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా పొడి దగ్గు సమస్య తగ్గుతుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా మంది ఈ పొడి దగ్గుతో బాధపడుతుంటారు. వాతావరణ మార్పుల వల్ల శీతల పానీయాల వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే పొడి దగ్గు సమస్యని తొలగించడానికి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి.
పొడి దగ్గు సమస్య ఉంటే తులసి ఆకులను వేడి నీటిలో వేసి ఆ నీటిని బాగా మరిగించి కషాయం తాగితే దగ్గు తగ్గుతుంది.
అలానే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి ప్రతి రోజూ తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
ఒకవేళ దగ్గు కనుక తీవ్రంగా ఉంటే అప్పుడు రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది.
ఒకవేళ కనుక పిల్లలు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే అప్పుడు అల్లం పొడిని దానిమ్మ రసంలో కలిపి వాళ్లకి ఇస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
అలానే పొడి దగ్గు తగ్గాలంటే వేడి వేడి మసాలా టీ కూడా తగ్గిస్తుంది. దీనికోసం మీరు అరచెంచా అల్లం పొడిని, చిటికెడు దాల్చిన చెక్క పొడిని టీ లో వేసి వేడి వేడిగా టీ ని తీసుకుంటే సరిపోతుంది. మిరియాల పొడి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది. ఆగకుండా దగ్గు వస్తే మిరియాల కషాయం తీసుకోండి. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలను మీరు కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా పొడి దగ్గు సమస్య తగ్గుతుంది. కనుక ఒకసారి వీటిని ప్రయత్నం చేసి చూడండి ఆ తర్వాత మీకు వీటి యొక్క ఫలితం కనపడుతుంది.