Regina Cassandraa: మందు గ్లాసు చేతిలో పట్టుకుని..తాగేయండంటున్న హీరోయిన్!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ఇటీవల..విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో మెరిసింది. ఇందులో ఐటెం సాంగ్ ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ చేసింది. చిరుతో చిందే సే చాన్స్ కొట్టేసిన ఈ భామ ప్రస్తుతం..తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ కథానాయికగా నటిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ సుందరి. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ఈ భామ..ఇన్ స్టా గ్రామ్ వేదికగా హెల్త్ గురించి పలు సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. కాగా, తాజాగా ఈ సుందరి చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ భామ ఏం చేసిందంటే..

ప్రముఖ వైన్ ‘బ్లెండర్స్ ప్రైడ్ ’ ప్రమోషన్స్ కు ఓకే చెప్పేసింది హీరోయిన్ రెజీనా కసాండ్ర. ప్యాషన్ , డిటర్మినేషన్ ఉన్న వారు ‘బ్లెండర్స్ ప్రైడ్’ వైన్ తాగుతారని క్యాప్షన్ ఇచ్చి.. తన చేతిలో బ్లెండర్స్ ప్రైడ్ మందు పోసి ఉన్న గ్లాస్ పట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చింది.

Regina-65th-Jio-Filmfare-Awards-2018-photos

బ్లాక్ కలర్ డ్రెస్సులో అలా క్యూట్ గా నిలబడి రెజీనా ‘బ్లెండర్స్ ప్రైడ్ ’ వైన్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇది చూసి నెటిజన్లు ‘ఆసమ్’ అంటున్నారు. ఇటీవల పాయల్ రాజ్ పుత్, ప్రగ్యాజైస్వాల్ విస్కీ ప్రమోషన్స్ కు ఓకే చెప్పగా, తాజాగా మరో భామ ఈ జాబితాలో చేరిపోయిందని నెటిజన్లు అనకుంటున్నారు.
https://www.instagram.com/p/CdLX1c6vqaa/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news