ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతోంది. చైనా వూహన్ లో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచం తీవ్రంగా నష్టపోయింది. ఇండియాలో కూడా కరోొనా వల్ల 5 లక్షల మరణాలు సంభవించాయి. దీనికి తోడు ఆర్థికంగా కూడా దేశం చాలా నష్టపోయింది. ఇదిలా ఉంటే రకరకాల వైరస్ లు దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ వంటి వ్యాధులను గుర్తించారు.
ఇదిలా ఉంటే తాజాగా షిగెల్లా బ్యాక్టీరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో 16 ఏళ్ల అమ్మాయి. దేవానంద దీని బారినపడి చనిపోయింది. ఇది అంటు వ్యాధి కావడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఈ వ్యాధి సోకిన వారు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారంతో బాధపడుతారు. ఇటీవల కేరళలోని కాసర్ గడ్ లో పాచిపోయిన చికెన్ షవర్మా తిని కొంతమంది ఈవ్యాధి బారిన పడ్డారు. దాదాపుగా 30 మంది దాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.