పేరు పెట్టి లక్షలు సంపాదిస్తున్న యువతి..!

-

ఒకప్పుడు అంటే చనిపోయిన నానమ్మ, తాతయ్య పేర్లు వచ్చేలా పుట్టినబిడ్డకు పేర్లు పెట్టేవాళ్లు.. లేదంటే.. వాళ్ల కులదైవం పేరులో మొదటి లెటర్ వచ్చేలా చూసుకుని పెట్టేవాళ్లు.. కానీ ఇప్పుడు అలాకాదు..పేర్లు అంతా మోడ్రన్ గా స్టేలిష్ గా ఉంటున్నాయి.. అలా లేకపోతే.. పిల్లలు పెద్దయ్యాక వాళ్లే కొత్త పేరుకుంటున్నారు కూడా.. అయితే ఇలా పేర్లు పెట్టే క్రమంలో మనం సెలెక్ట్ చేసిన పేరు మీరు కుటుంబంలో ఇంకొకరికి నచ్చదు. ఇదంతా ఓ పెద్దపంచాయితీ…ఈ లొల్లి అంతా ఎందుకు మేమే మంచి పేరు పెడతాం అంటోంది ఓ అమ్మాయి.. ఇదే వాళ్ల బిజినెస్..ఒక్క పేరుకు లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తుందట.. ఓర్ని.. ఇదేంట్రా బాబూ అనుకుంటున్నారా.. అసలు ఈమె కథోంటో మీరు చూడండి..!

టేలర్‌ హంఫ్రే.. ప్రొఫెషనల్‌ బేబీ నేమర్‌. న్యూయార్క్ లో ఉంది.‌ 2018 నుంచి హంఫ్రే ఈ సేవలను అందిస్తోంది. ఒక్కో పేరు పెట్టినందుకు కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ తీసుకుంటుంది.. ఈ 33 ఏళ్ల మహిళ గత ఏడాదిలోనే 100 మందికిపైగా పిల్లలకు పేరు పెట్టిందట. దాదాపు రూ.కోటిపైనే సంపాదించిందంటే తాను పెట్టే పేర్లకి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మీరే ఆలోచించండి..

అలా మొదలైంది..

హంఫ్రే న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి 2015లో మేనేజ్‌మెంట్‌ విద్య పూర్తిచేసింది. మాట్రిమోనీ, ఫండ్‌ రైజింగ్‌, ఈవెంట్‌ ప్లానింగ్‌ వంటి వ్యాపారాలు కూడా చేసింది.. రచయిత్రి కూడా. కొన్ని టీవీ కార్యక్రమాలకు స్క్రీన్‌ప్లే రాసేది.. తన చుట్టుపక్కల చాలామంది పిల్లలకు భిన్నమైన పేరు పెట్టాలని వెతకడం, కొందరు రకరకాల కారణాల రీత్యా పేరు మార్చాలనుకోవడం చూసిన తను..తనకు నచ్చిన పేర్లను సోషల్‌ మీడియాలో అర్థాలతో సహా పెట్టడం స్టాట్ చేసిందగి.. దీంతో ఫాలోయర్లు పెరగడమే కాక.. తమకు ఆ పేరు నచ్చిందనీ, తమ పిల్లలకు పెట్టామనీ మెసేజ్‌ చేసేవారట. అది ఆమెకు మస్త్ హ్యాపినెస్ ఇచ్చేది.. దీన్నే కెరియర్‌గా మలచుకుంటే బాగుంటుందని అనిపించి 2018 నుంచి కొంత మొత్తం తీసుకొని పేర్లు సూచించడం మొదలుపెట్టింది. ‘వాట్స్‌ ఇన్‌ ఎ బేబీ నేమ్‌’ పేరుతో వెబ్‌సైట్‌ని కూడా ప్రారంభించింది.

అంత సింపుల్ ఏం కాదండోయ్..

ఓడియమ్మ… ఒక్క పేరు పెట్టి లక్షలు వసూలు చేస్తుంది.. బిజినెస్ చాలా ఈజీ అనుకుంటున్నారా.. అంతలేదు..తనేమీ ఆషామాషీగా పేరు పెట్టేయదు. తల్లిదండ్రుల నమ్మకాలు, వాళ్ల పూర్వాపరాలు, మొదటిసారి కలిసిన ప్రదేశం సహా ఇలా ఎన్నో వివరాలనూ కూలంకషంగా తెలుసుకుని దాన్ని బట్టి పేరు సూచిస్తుందట. ఒక్కోసారి ఆ పేరు విని. ఆమె అడిగిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ చెల్లిస్తారట. తన ఇన్‌స్టా ఖాతాను 28 లక్షలకుపైగా ఫాలో అవుతున్నారు. మొత్తానికి అలా తన బిజినెస్ నడుస్తుంది.. మీలోనూ ఇలాంటి క్రేజీ థాట్స్ ఉంటే వాటిని బయటపెట్టండి మరీ..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news