రీజినల్ సెక్యూరీటీ డైలాగ్ సమావేశానికి చైనా, పాక్ డుమ్మా..

-

భారత్ నిర్వహిస్తున్న రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ సమావేశానికి పాక్, చైనా దేశాలు రావడం లేదు. జాతీయ భద్రతా సలహాదారులు హాజరయ్యే ఈ సమావేశానికి వారి ప్రతినిధులను పంపించలేమని ఇరు దేశాలు చెప్పారు. ఈ నెల 10 న ఢిల్లీ వేదికగా ఈ సమావేశం జరుగనుంది. ఆఫ్ఘనిస్తాన్ జరుగుతున్న పరిణామాలపై ఈకార్యక్రమంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి పాక్, చైనాతో పాటు రష్యా, ఇరాన్, కిర్గిజ్ స్థాన్, తజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, కజకిస్తాన్ దేశాలను భారత్ ఆహ్వానించింది. భారత జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ ధోవల్ సారథ్యంలో ఈ సమావేశం జరుగనుంది.

ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆదేశంలో కల్లోలం చెలరేగుతూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల శాంతికి విఘాతం ఏర్పడే అవకాశం ఏర్పడింది. దీంతో దక్షిణాసియా దేశాలతో పాటు ఆఫ్ఘన్ సరిహద్దు దేశాల్లో భద్రత, సహకారం గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదం, రాడికలిజం, డ్రగ్స్ సరఫరా మొదలగు అంశాలు చర్చకు రానున్నాయి.  ఈ సమావేశానికి చైనా సీపీసీ మీడింగ్ ను చూపించి రావడం లేదు. మరోవైపు దాయాది దేశం కూడా ఇండియా చేపట్టిన ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. చైనా ఇటు భారత్, అటు ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఎప్పటికప్పుడ మెరుగుపరుచుకుంటా అనే స్టేట్ మెంట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news