మీకు 18 ఏళ్ళు దాటాయా..? అయితే కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఇలా చేయండి…!

-

కరోనా వైరస్ మహమ్మారయ్యి పట్టి పీడిస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ కూడా ఏప్రిల్ 28 నుంచి అంటే ఈ రోజు నుండి వాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే వ్యాక్సిన్ వేయడం అనేది మే 1 నుంచి మొదలవుతుంది.

మీకు 18 ఏళ్ళు నిండాయా..? మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటున్నారా…? అయితే రిజిస్టర్ ఎలా చేసుకోవాలో చూడండి.

ముందుగా cowin.gov.in ఈ అఫీషియల్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
ఆ తర్వాత మీకు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి.
ఒకసారి ఓటిపి వాలిడేటెడ్ అని వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ వాక్సినేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వివరాలను ఎంటర్ చేయండి. ఒకసారి వివరాలు అన్ని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
అక్కడ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి.

గత వారం నుంచి కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా ఇతర రాష్ట్రాలు కూడా 18 ఏళ్లు దాటిన వాళ్లకి వ్యాక్సిన్ వేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news