కెమికల్స్ వాడటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుదల.. ఇది ఇలాగే కొనసాగితే..?!

-

కెమికల్స్ వాడటం వల్ల మానవ శరీరంలో శుక్రకణాల సంఖ్య.. సంతానోత్పత్తికి తగినట్లుగా పరిగణించబడే స్థాయి కంటే తగ్గుదల ఏర్పడుతోందని ఎపిడెమియాలజిస్ట్ షన్నాస్వాన్ తెలిపారు. తాను రచించిన కొత్త పుస్తకం ‘కౌంట్డౌన్‌’లో పలు విస్తుబోయే అంశాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో పాశ్చాత్య సంస్కృతి కొనసాగుతోంది. మనుషుల జీవన విధానం మారింది. మనుపటిలా మనుషులు ఆరోగ్యంగా ఉంటూ.. పౌష్టికాహారాన్ని తీసుకోవడం లేదన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో.. ఉద్యోగం, డబ్బు సంపాదించాలనే తొందరలో అనారోగ్యాలకు గురవుతున్నారు. శరీరం, ఆహారం మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. దీని వల్ల వారికి పుట్టబోయే తరాలకు ఇబ్బందిగా మారుతుందన్నారు. ప్రస్తుతం 40 ఏళ్ల మనుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి సంఖ్య 50 శాతం వరకు పడిపోయాయని ఆయన వెల్లడించారు.

శుక్రకణాలు
శుక్రకణాలు

కౌంట్డౌన్ పుస్తకంలో ఎపిడెమియాలజిస్ట్ షన్నాస్వాన్.. భవిష్యత్‌లో మనుషులు 50 శాతం వరకు సగం స్పెర్మ్ కౌంట్‌ను కలిగి ఉంటారన్నారు. 2060 నాటికి మనుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం పూర్తిగా కోల్పోతారని పేర్కొన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. పునరుత్పత్తి, శుక్రకణాలపై పరిశోధనలు నిర్వహించినప్పుడు మనుషులు, వన్యప్రాణుల్లో సంతానోత్పత్తి క్షీణిస్తున్నట్లు గుర్తించారు. శుక్రకణాలు సామర్థ్యం తగ్గుదల వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మనుషుల వినాశనానికి దారితీస్తుందన్నారు.

ఈ సమస్య రావటానికి ప్రధాన కారణాలను కూడా షన్నాస్వాన్ గుర్తించారు. ప్రస్తుత జీవన విధానంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రోజూ కెమికల్స్‌తో కూడా మెడిసిన్స్, కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం జరుగుతోంది. దీంతో శరీరంలో పునరుత్పత్తి సామర్థ్యం చాలా వరకు తగ్గుతోందని ఆయన పేర్కొన్నారు. కెమికల్స్‌కు దూరంగా ఉంటూ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాలని ఆయన సూచించారు. 1973, 2011 మధ్య వయస్కుల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ 50 నుంచి 60 శాతం తగ్గింది. సంవత్సరానికి 1 నుంచి 2 శాతం శుక్రకణాల సంఖ్య తగ్గుతోందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news