ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగ కరోనా వ్యాప్తి, థర్డ్ వేవ్ కారణంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పై కేంద్ర ఎన్నికల సంఘం పలు ఆంక్షలు విధించింది. కాగ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి, థర్డ్ వేవ్ తగ్గడంతో పలు ఆంక్ష లపై కేంద్ర ఎన్నికల సంఘం సండలింపులు ఇచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారం కోసం 50 శాతం సామర్థ్యంతో సభలు, ర్యాలీలు, రోడ్ షో లను నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
అయితే ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. వీటితో పాటు ఎన్నికల ప్రచారంపై ఇప్పటికే ఉన్న నిబంధనలు ఉంటాయని స్పష్టం చేసింది. కాగ ఇప్పటికే పంజాబ్, ఉత్తరా ఖండ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉత్తర ప్రదేశ్ లో నేడు నాలుగో దశ పొలింగ్ జరుగుతుంది. ఇంకా.. 5,6,7 విడుదలలో పోలింగ్ జరగాల్సి ఉంది. అలాగే మణిపూర్ రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది.