దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. దీంతో తెలంగాణకు రూ. 2,682 కోట్లు, ఏపీకి రూ. 5,474 కోట్ల నిధులను విడుదల చేసింది.
కాగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,40,318 కోట్లు పంపిణీ చేసింది. అయితే నెలవారి రూ.70,159 కోట్లు విడుదల చేస్తుండగా ఈసారి చెల్లించిన విడతలో మాత్రం రెండు విడతలను ఒకేసారి ఇచ్చింది.