తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. దరఖాస్తుదారుల మెరిట్ జాబితాలో తెలంగాణ వైద్య సేవల నియామక మండలి రెండు మూడు రోజుల్లో వెల్లడించనుంది.
ఆ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించాక వాటిని పరిష్కరించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని అంశాలపై మండలి దృష్టి సారించింది. బోధనాసుపత్రుల్లో తోలుత 1,147 సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా అనంతరం మరో 295 పోస్టులను చేర్చి మొత్తం 1,442 పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.