Raviteja: రామారావు ఆన్ డ్యూటీ నుండి అదిరిపోయే సర్‌ప్రైజ్!

-

“రామారావు ఆన్ డ్యూటీ” మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండడంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రవితేజ రీసెంట్ గా నటించిన “ఖిలాడి” మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మాస్ మహారాజ్. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సింగల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సంబంధించిన అనౌన్సమెంట్ ను ఏప్రిల్ 7న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను జూన్ 17 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news