నెలలో రెండు సార్లు జీతాలు చెల్లించనున్న రిలయన్స్ సంస్థ

-

మొన్న దిగ్గజ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ పేస్ బుక్ తమ ఉద్యోగులకు ఒక బంపర్ బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో పరి ఒక్కరికీ కూడా వర్క్ ఫ్రం హోం తో పాటు 6 నెలల బోనస్ ను కూడా ఇస్తున్నట్లు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తమ ఉద్యోగులకు ఒక బంపర్ బోనస్ ప్రకటించింది. నెల జీతం 30 వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు నెలలో రెండు సార్లు జీతం ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్‌స్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వారికి డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులకు కూడా లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించేందుకు నిర్ణయించింది. ఇక వర్క్ ఫ్రమ్ హోం విధానం విషయంలోనూ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సంక్లిష్టమైన బాధ్యతల్లో ఉన్న ఉద్యోగులు తప్ప మిగతా వారందరూ ఇంటి నుంచే పనిచేయచ్చని ఆ సంస్థ సూచించింది. మరోపక్క తెలుగురాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ సోకి 10 మంది మృతి చెందగా,ఇప్పటివరకు 5వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

మరోపక్క జాతిని ఉద్దేశించి రెండోసారి మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల్లో ఈ లాక్ డౌన్ పీరియడ్ ను 21 రోజుల పాటు పాటించాలి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మహమ్మారి ని నియంత్రించాలి అంటే కనీసం మూడు వారాల పాటైనా ఈ లాక్ డౌన్ ను పాటించి ప్రజలు సహకరించాలి అంటూ ప్రధాని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news