ఏపీలో అత్యంత కీలకపరిణామంగా పరిగణించే ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అచ్చెన్నాయుడికి ఎదురుదెబ్బ తగిలిందని అనుకోవాలో లేక ఉచ్చు బిగుస్తుందని భావించాలో తెలియదు కానీ… ప్రస్తుతం అచ్చెన్నతో పాటు టీడీపీ పెద్దలు బెయిల్ పై పెంచుకున్న ఆశలు మొత్తం తొలగిపోయినట్లే! ఇదే క్రమంలో అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో కూడా వారికి బ్యాడ్ న్యూస్ వెలువడింది!
ఈఎస్ఐ అవినీతీ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్ తో పాటు ఈస్కాంకు సంబందించిన మిగిలినవారి బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ వ్యవహారంలో అచ్చెన్న చుట్టూ ఉచ్చు బిగుస్తుందని, బెయిల్ రాకపోవడం దానికి మరో బలమైన సంకేతమనే మాటలు వినిపిస్తున్నాయి! ఇదే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది!
కేసు పురోగతి సాగుతున్న దశలో అచ్చెన్నాయుడు బయటకు వస్తే.. సాక్ష్యులను ప్రభావింతం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరుపు న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు… అచ్చెన్నాయుడికి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇదే సమయంలో ఈ కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేశ్‌కుమార్ బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది.
కాగా… ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెల 12న అచ్చెన్నను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.