ఇద్దరు స్నేహితులు కలిసినా, ఇద్దరు కొత్తగా అప్పుడే పరిచయమైనా, బిజినెస్ మీటింగైనా, పెళ్ళి చూపులైనా, ఎలాంటి ఫార్మల్ మీటింగైనా కాఫీ కప్పుతోనే మొదలవుతాయి. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని గంటల పాటు ముచ్చట పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐతే కాఫీ వల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయన్న విషయం మర్చిపోతారు. కాఫీ మరకలు అంత ఈజీగా పోవని, దంతాలపై ఉండే ఎనామిల్ పొరకి ఇవి చేటు కలిగిస్తాయని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇలా ఏర్పడ్డ కాఫీ మరకల్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా, బ్రష్ చేయడం అనేది కంపల్సరీ. ఈ కాఫీ మరకలు బ్రష్ చేసినప్పటికీ తొలగిపోవు. కానీ రోజూ రెండు సార్లు బ్రష్ చేయడం తప్పని సరి.
కాఫీ తాగేటపుడు స్ట్రా వాడితే ఆ మరకలు ఏర్పడకుండా ఉంటుంది. కాఫీ డైరెక్టుగా దంతాలకి తగలదు కాబట్టి మరకలు ఏర్పడే అవకాశం తక్కువ. మీకు వీలైతే స్ట్రా వాడండి.
బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ ని మిక్స్ చేసి టూత్ పేస్ట్ ని తయారు చేయవచ్చు. ఈ రెండింటి మిశ్రమంతో పళ్ళు తోమితే కాఫీ మరకలు పోయే ఛాన్స్ ఉంటుంది.
కాఫీ తాగేటపుడు మధ్య మధ్యలో నీళ్ళు తాగండి. దానివల్ల కాఫీ మరకలు పళ్ళకి అంటుకోకుండా ఉంటాయి. కాబట్టి మరకలు ఏర్పడకుండా ఉండి మీ పళ్ళు బాగుంటాయి.
తొందరగా తాగండి. మీరు, మీ ఫ్రెండ్ కాఫీ తాగుతున్నట్లయితే ఐదు నిమిషాల్లో మీరు కాఫీ తాగేస్తే మీరు చాలా లక్కీ అన్నమాట. తొందరగా కాఫీ తాగడం వల్ల మరకలు దంతాలకి అతుక్కోకుండా ఉంటాయి.
చక్కెర లేని చూయింగ్ గమ్ లని వాడడం పళ్ళకి మంచిదని అమెరికా వైద్యులు తేల్చారు.