శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రేణుదేశాయ్..??

-

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన ఇద్దరు పిల్లలతో పూణేలో ఉంటుంది. తెలుగు టెలివిజన్ రంగంలో కొన్ని డ్యాన్స్ టెలివిజన్ షో లకు జడ్జి గా వ్యవహరిస్తూ మరోపక్క సినిమాలు నిర్మిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. ఇటువంటి తరుణంలో రేణు దేశాయ్ ‘చూసి చూడంగానే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరు అయ్యి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమారంగంలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువ రావాలని అలాగే ఫిమేల్ డైరెక్టర్ మరియు మేల్ డైరెక్టర్ అనే బేధం లేకుండా ఇండస్ట్రీ లో వాతావరణం ఉండాలని ఏ మహిళా టెక్నీషియన్ ఒత్తిడి లేకుండా సంతోషంగా పని చేసుకునే రోజులు రావాలని రేణు దేశాయ్ కోరారు.

Image result for renu desai sekhar kammula"

అంతేకాకుండా ‘చూసి చూడంగానే అనే’ ఈ సినిమాలో నేను ఒక పాత్ర చెయ్యాలనే చాన్స్ వచ్చింది కానీ ఆ సమయంలో నాకు హెల్త్ బాగాలేక అవకాశం వదులుకున్నాను అని తెలిపిన రేణుదేశాయ్ ఖచ్చితంగా మరో సినిమా ఛాన్స్ వస్తే బాగుంటుందని కోరుకున్నారు. అంతేకాకుండా మదర్ క్యారెక్టర్ తరహాలో సినిమా చేయాలని ఉందని స్టోరీ దొరికితే ఖచ్చితంగా ఆ టైప్ సినిమాలు చేస్తానని తెలిపిన రేణు దేశాయ్ …మాటలు బట్టి చూస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి రేణు దేశాయ్ రెడీ గా ఉన్నట్లు అర్థమవుతుంది.

 

దీంతో రేణుదేశాయ్ వ్యాఖ్యలు విన్న సోషల్ మీడియాలో కొంతమంది.. ఆమెను సపోర్ట్ చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రేణు దేశాయ్ నటిస్తే చాలా బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. గతంలో ఈ విధంగానే అక్కినేని అమల ని అద్భుతంగా రీ-ఎంట్రీ శేఖర్ కమ్ముల చేయించారని అంటున్నారు నెటిజన్లు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అయితే మంచి క్లాసిక్ క్యారెక్టర్ రేణు దేశాయ్ గారికి దొరుకుతుందని కామెంట్లు పెడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news