మహేష్ తల్లిగా అయితే నేను రెడీ అంటున్న రేణు…!

-

గత కొంత కాలంగా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న రేణుదేశాయ్ ఇప్పుడు ఆఫర్ల కోసం ఎదురు చూస్తుంది. మంచి సినిమా ఆఫర్లు వస్తే… అంటే తల్లిగా లేదా టీచర్ గా ప్రొఫెసర్ గా ఆఫర్ వస్తే చెయ్యాలి అని చూస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుపుతుంది రేను. ఆమె ఖాళీగా ఉండటంతో అగ్ర దర్శకులు కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి.

ప్రస్తుతం రేణు సినిమాల్లో అప్పుడప్పుడు కనపడుతుంది. తాజాగా ఆమె కీలక ప్రకటన చేసింది. మ‌హేష్‌, ప్ర‌భాస్ వంటి వారికి త‌ల్లిగా న‌టించే అవ‌కాశం వ‌స్తే చేస్తారా? అని ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. రేణు దేశాయ్ స‌ద‌రు హీరోల చిన్న త‌నంలోని పాత్ర‌ల‌కు తల్లి పాత్ర చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని సమాధానం చెప్పడం గమనార్హం.

తనను ముస‌లి లుక్‌లో బాగా చూపింగ‌ల‌రు అనే న‌మ్మ‌కం ఉంటే అలాంటి ద‌ర్శ‌కులు తెర‌కెక్కించే చిత్రాల్లో మ‌హేష్‌లాంటి హీరోల‌కు త‌ల్లిగా న‌టిచేందుకు సిద్ధ‌మేన‌ని ఆమె స్పష్టం చేసారు. మేమంతా ఆర్టిస్టులం.. ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు రెడీగా ఉండాలి అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ ఆమెకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news