దళితులకు కేసీఆర్‌ శుభవార్త.. మెడికల్ షాపుల్లోనూ రిజర్వేషన్లు !

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక నుంచి దళితులపై కేసీఆర్‌ సర్కార్‌ బాగా ఫోకస్ చేసింది. దళిత బంధు పేరుతో… ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడం, వైన్స్‌ లోనూ దళితులకు రిజర్వేషన్లను కేసీఆర్‌ సర్కార్‌ కల్పించింది. అయితే… తాజాగా దళితులకు మరో శుభవార్త చెప్పింది ప్రభుత్వం. మెడికల్‌ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్‌ సర్కార్‌ సన్నద్ధం అవుతోంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. నిన్న ఆయన హుస్నాబాద్‌ మీటింగ్‌ లో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని చెప్పారు. మెడికల్‌ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందన్నారు. అటు రైతులను కాపాడేది టీఆర్‌ఎస్‌..ముంచేది కేంద్రమని.. మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.

తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని, రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంపు చేస్తోందని, కొనుగోలు తగ్గిస్తుందని ఆగ్రహించారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news