తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా.. ఎక్సైజ్ శాఖ లో పలు మార్పులు తీసుకువస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో… వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్. మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ, మరియు ఎస్టీ సామాజిక వర్గాల వారికి… రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు… ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్. తెలంగాణ కేబినెట్ నిర్ణయం ప్రకారం… గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం మరియు ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. తెలంగాణ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమలు కానుంది.