వైసీపీకి రాజీనామా..కాంగ్రెస్ పార్టీలోకి వాసిరెడ్డి పద్మ?

-

ఏపీలో అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కీలక నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం నేటి రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఓట్లేసిన ప్రజలు ఏం అడుగుతారనే భయం నేతల్లో లేకుండా పోయింది.దీంతో తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి, అధికారం కోసం వెంపర్లాడుతున్నారు.

ఈ కోవలోకి వైసీపీ కీలక నేత వాసిరెడ్డి పద్మ సైతం వచ్చిచేరారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. ఏ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీ నేతలపై విరుచుకపడిన ఆమె.. తనకు అన్ని పార్టీల్లోనూ ఆప్తులు ఉన్నారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె కూటమి ప్రభుత్వంలోకి వెళతారా? అని చర్చ జరుగుతుండగా.. ఆమెకు కాంగ్రెస్ నుంచి సైతం ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version