కేబీఆర్ పార్కు వద్ద యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అరెస్ట్

-

హైదరాబాద్ బంజారాహిల్స్ ఓ లగ్జరీ ఇంపోర్టెడ్ ఖరీదైన కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  రోడ్ నెంబర్ 14 లో కేబీఆర్ పార్క్ వద్ద అదుపు తప్పి ఫుట్ పాత్ పై దూసుకెళ్ళి , ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. కారును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని అక్కడి నుంచి పీఎస్ కు తరలించారు.

తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. కార్ తో కేబీఆర్ ఫుట్ పాత్ ను ఢీ కొట్టిన వ్యక్తి ఉత్సవ్ దీక్షిత్ గా గుర్తించారు. ఉత్సవ దీక్షిత్ బిజినెస్ మాన్ అని వెల్లడించారు.  నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు అతని పై  కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఉత్సవ్ దీక్షిత్ డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి RTA అధికారులకు పంపించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version