‘మన్ కీ బాత్’ కార్యక్రమం పున ప్రారంభం… ఎప్పటినుంచి అంటే..?

-

మోడీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం జూన్ 30 నుండి పునః ప్రారంభమవుతుందని మోడీ ఇవాళ తెలిపారు.ఆయన తన సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో వ్యాఖ్యానిస్తూ, సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించలేదు, కొన్ని నెలల విరామం తర్వాత ఇప్పుడు తిరిగి వస్తుంది అని అన్నారు. ఈ నెల కార్యక్రమం ఆదివారం, 30 జూన్ నాడు ప్రసారం కానుంది.దీని కోసం మీ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవాలని నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. MyGov ఓపెన్ ఫోరమ్, NaMo యాప్‌లో లేదా 1800 11 7800 నంబర్‌లో మీ అభిప్రాయాలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతినెలా చివరలో ‘మన్ కీ బాత్’ ప్రసారాన్ని నిర్వహిస్తారు. చివరిసారిగా 110వ ఎపిసోడ్‌ ను ఫిబ్రవరి 25న ప్రసారం చేశారు. ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును పొందిన వారు రికార్డు సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news