హీరో నాగార్జునకు రైతు బంధు.. రిటైర్డ్ ఐఏఎస్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకంపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నాగార్జున లాంటి సినిమా హీరోలకూ రైతుబంధు అందుతోందని ఆరోపించారు. చాలా మంది రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దృష్టిలో కౌలు రైతులు అసలు రైతులే కాదని అన్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 7 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

Nagarjuna - The Siasat Daily

రైతుల వ్యవహారాలకు సంబంధించిన రాజ్యాంగ బద్ధ సంస్థ లాంటి ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆకునూరి మురళి సూచించారు. రాష్ట్రంలో సహకార సంఘాలు.. మార్కెట్ కమిటీలు బలోపేతం కావాలి కానీ రాజకీయ నాయకులు వారి లబ్ది కోసమే వీటిని వాడటం మానుకోవాలని పేర్కొన్నారు. రైతు పండించిన పంటను కనీసం స్టోరేజ్ చేసుకోవడం కోసం గిడ్డంగులు.. గోదాములు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 124 ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ లు ఉన్నాయని.. ప్రభుత్వమే 1000 కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందని ఆకునూరి మురళీ అభిప్రాయపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news