BREAKING: ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్. ఏపీలో తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. కాకినాడ కలెక్టరేట్ లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు రిటర్నింగ్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్ షాన్మోహన్. ఈ నెల 11న నోటిఫికేషన్ అమలులోకి రానుంది.
ఆరు కొత్త జిల్లాలలో 116 పోలింగ్ కేంద్రాలు,16316 మంది ఓటర్లు ఉన్నారు. డిసెంబర్ 5న పోలింగ్, 9 న కౌంటింగ్ ఉంటుందని రిటర్నింగ్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందని ప్రకటన చేశారు రిటర్నింగ్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్ షాన్మోహన్. సాబ్జి మృతి తో ఉప ఎన్నిక వచ్చిందని తెలిపారు రిటర్నింగ్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్ షాన్మోహన్. అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటు హక్కు కోసం.. అప్లై తేదీ కూడా ఇవాళ ముగియనుంది.