బండి సంజయ్‌ అన్ని అవమానాలే..బీజేపీకి రాజీనామా చేయాలి : రేవంత్‌

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మరో బాంబ్‌ పేల్చారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల ఎన్నికల ప్రచారం కోసం విద్యాసాగర్ రావు.. సుగునకర్ రావు లు ఎందుకు ప్రచారం చేయడం లేదని… ప్రశ్నించారు. . కరీంనగర్ పట్టణం లో మురళీధర్ రావు ఫ్లెక్సీ పెట్టారు…కానీ సంజయ్ బొమ్మ కూడా పెట్టలేదని పేర్కొన్నారు.

బండి సంజయ్ ని… విద్యాసాగర్ రావు, మురళీధర్ రావులు చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. అలాంటి అధ్యక్ష పదవి ఎందుకు… రాజీనామా చేసి… మురళీధర్ రావు పై చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్‌ కి సలహా ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. మురళీధర్ రావు కు కెసిఆర్ అండ ఉందని భయపడకు అంటూ బండి సంజయ్‌ కి భరోసా కల్పించారు రేవంత్‌ రెడ్డి. ప్రజల సమస్యల కోసం ఈటల రాజేందర్‌ రాజీనామా చేయలేదని ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. సొంత పార్టీ నాయకులకు కట్నాలు చెల్లించే సంస్కృతిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ..బీజేపీ లు ప్రవేశ పెట్టాయని మండిపడ్డారు. ఎన్నికలు..ఫిరాయింపుల తోనే తెలంగాణ రాజకీయం గడుస్తుందని నిప్పులు చెరిగారు.