రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన నరరూప రాక్షసుడు మోడీ : రేవంత్ రెడ్డి

-

సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గటం పై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్ష తో పోరాటం చేశారని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో…రైతులు కూడా అదే స్ఫూర్తి తో ఉద్యమం చేశారు అంటూ ప్రశంసించారు. దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవలని చూస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించాడు.

వ్యవసాయం అదాని..అంబానీకి అమ్మకం కి పెట్టాలని చూశారని….ఇందిరా గాంధీ పుట్టిన రోజున నల్ల చట్టాలు రద్దుతో రైతులు విజయం సాధించారని అన్నారు. మొదటి రోజే చట్టాలు వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవి అని అన్నారు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన నరరూప రాక్షసుడు మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మోడీ నీ క్షమించరని అన్నారు. వ్యవసాయం సంక్షోభానికి కారణం మోడీ కెసిఆర్ లు అంటూ మండి పడ్డారు. పార్లమెంట్ లో చట్టం కి అనుకూలంగా కేసీఆర్ ఓటేశారని…. సభలో చట్టాల కు వ్యతిరేకంగా తీర్మానం చేసే దైర్యం లేదని అన్నారు. కానీ క్రెడిట్ నాది అంటున్నారని….అది రైతులను అవమానించడమే అని వ్యాఖ్యానించారు. ఎవడికో పుట్టిన పిల్లలకు కుల్ల కుట్టించినట్టు ఉంది కేసీఆర్ తీరు అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news