RGV MISSING : ”ఆర్జీవీ మిస్సింగ్” ట్రైలర్ రిలీజ్.. మాములుగా లేదుగా !!

-

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. రామ్‌ గోపాల్‌ చేసినా సంచలనమే. వెండితెరపై సినిమా తీసినా… ఓటిటీలో వెబ్ సిరీస్ రూపొందించిన ఆయన స్టైలే వేరు. ఇంకా బయోపిక్ సినిమాల నిర్మాణం లో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రక్త చరిత్ర, కడప రెడ్లు, చంద్రబాబు వెన్నుపోటు పై సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై సినిమా రూపొందిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్‌ అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన వర్మ…. ఇప్పుడు ఆ సినిమాకు ప్రమోషన్స్‌ మొదలు పెట్టాడు. తాజాగా ఆర్జీవీ మిస్సింగ్‌ ట్రైలర్‌ ను విడుదల చేశాడు వర్మ. ఈ ట్రైలర్‌ ఏపీ పాలిటిక్స్‌ ను అందం పట్టేలా ఉంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఓటమి, అలాగే చంద్రబాబు – లోకేష్‌ యవ్వరాన్ని కళ్లకు కటినట్లు చూపించాడు వర్మ. అలాగే.. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు కిడ్నాప్‌ చేశారనే కోణంలో సినిమాను తీసినట్లు…. ఈ ట్రైలర్‌ చూస్తే అర్థమమౌవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news