రైతుబంధు ఎత్తేసే కుట్ర జ‌రుగుతోంది : రేవంత్ రెడ్డి సంచ‌ల‌నం

ఇవాళ ఉద‌యం.. నుంచి రైతు బంధు ప‌థ‌కం అమ‌లు పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌రి వేసిన రైతుల‌కు రైతు బంధు ఇవ్వ‌బోమంటూ… టీఆర్ ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాలో… ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అలాగే.. టీఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన న్యూస్ పేప‌ర్ల‌లోనూ.. దీనిపై క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన మెడ మీద కేంద్రం కత్తి పెడితే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చానని చెప్పిన అసమర్ధ ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు మెడ మీద రైతుబంధు కత్తి పెట్టి వరి వేయవద్దంటున్నాడని నిప్పులు చెరిగారు.

revanth-reddy-cm-kcr

రైతుబంధు ఎత్తేసే కుట్రకు ఇది తొలి అడుగు. పరాహుషార్ రైతన్నా! అంటూ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ట్వీట్ చేశారు. కేసీఆర్ పాలనలో మద్ధతు ధరలు,పంట కొనుగోళ్లు బదులు రైతులకు అప్పుల కుప్పలు,ఆత్మహత్యలు మిగిలాయని.. చావుల పరిహారం కోసం రైతుల కుటుంబాలు చెప్పులరిగేలా తిరుగుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ.15 కోట్లు పరిహారం ఇవ్వడానికి ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదు…సిగ్గనిపించడం లేదా కేసీఆర్!? అంటూ నిప్పులు చెరిగారు.