ఫిబ్రవరిలో కేసీఆర్.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు : రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్​ కుట్రలు మొదలు పెట్టారని మండిపడ్డారు. కర్ణాటకలో 25మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్​ ఇటీవల మాట్లాడి వారికి 500కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.

తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు. సునీల్‌ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని..  బీఆర్​ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమని చెప్పారు.

దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పదంలో నడిపిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుజరాత్‌ ఎన్నికల్లో బీఆర్​ఎస్ తరుఫున ఎందుకు పోటీ చేయలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా తమ సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్‌ హిమాచల్‌, దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news