తెలంగాణ రాష్ట్ర పౌరుషానికి ప్రతీకలు అయిన సమ్మక్క – సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన త్రిదండి చిన జీయర్ స్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే యాదగిరి గుట్ట ఆగమ శాస్త్ర సలహా దారుడి బాధ్యతల నుంచి చిన జీయర్ స్వామిని వెంటనే తొలగించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మక్క – సారలమ్మలను అవమానించిన చిన జీయర్ స్వామిని తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు.
సమతా మూర్తి విగ్రహం పెట్టి చిన జీయర్ స్వామి వ్యాపారం చేయడం లేదా.. అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర భక్తిపై చిన జీయర్ స్వామి దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా రాష్ట్ర ప్రజల భక్తిపై, విశ్వాసాలను దెబ్బతీసే విధంగా.. చిన జీయర్ స్వామిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగ ఇటీవల సమ్మక్క – సారలమ్మ పై చిన జీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో భక్తులు, రాజకీయాకులు చిన జీయర్ స్వామిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.