వేసవిలో కమిలిన చర్మానికి పుచ్చకాయ పర్ఫెక్ట్ సొల్యూషన్..!

-

కాస్త తెల్లబడుతున్నాం అనే లోగా ఎండాకాలం వచ్చేస్తుంది. ఇక ఫేస్ మీద మొటిమలు, చెమటకాయలు అబ్బో ఆగం ఆగం. సమ్మర్ లో ఏది తినాలనిపించదు. అంత ఒక చిరాకు మూడు ఉంటుంది. ఏసీలు ఉంటే హాయిగా గడిచిపోతుంది కానీ.. లేనివారి పరిస్థితి ఏంటి.? సమ్మర్ లో ఫేస్ ని ఈ చికాకు నుంచి కాపాడుకోవాడనికి పుచ్చకాయ మేలు చేస్తుంది.

దాహాన్ని తీర్చి, శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా పుచ్చకాయ కాపాడుతుంది. ఇది రోగ్యానికే కాదు, అందానికీ ఎంతో మేలు చేస్తుంది. ఎండలో నుండి ఇంటికి వచ్చాక చర్మం అలసిపోతంది. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ ముక్కల్ని మెత్తగా చేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో అలసిన చర్మానికి చల్లదనంతోపాటూ ఉపశమనం ఉంటుంది.

ఎండకాలంలో మొటిమలు, చెమటకాయలు చాలా మందిని బాధిస్తుంటాయి. అలాంటి వారు పుచ్చకాయ తినటం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయ అడుగున తెల్లగా ఉండే పదార్దం చర్మానికి మేలు చేస్తుంది. దీంతో చర్మాన్ని రుద్దితే చెమట వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

రెండు చెంచాల పుచ్చ కాయ గుజ్జులో చెంచా తేనె చేర్చాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే.. చర్మం మృదువుగా మారుతుంది.

గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి.. అందులో నాలుగైదు చెంచాల పుచ్చకాయ రసం చేర్చి ఐస్‌ట్రేలలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐసుముక్కలుగా మారాక చర్మం మీద మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల తెరుచుకున్న గ్రంథులు మూసుకుపోయి. చర్మం నునుపుదేలుతుంది.

వేసవిలో చర్మం కమిలిపోతుంది. అలాంటి వారు పుచ్చకాయ గుజ్జు, కీరదోస గుజ్జును సమపాళ్లలో తీసుకుని అప్లై చేసుకోవాలి. తరవాత కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా పెరుగు చేర్చాలి. ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కున్నాక ఈ గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే..చర్మం కాంతిమంతంగా మారుతుంది. పొడిబారిన చర్మానికి ఈ పదార్థాలు రెండూ తేమనందిస్తాయి.

చర్మాన్ని మృదువుగా మార్చటంలో పుచ్చకాయ గుజ్జు బాగా ఉపకరిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరనివ్వదు. మూడు పుచ్చకాయ ముక్కలు తీసుకుని టేబుల్‌స్పూన్‌ నిమ్మరసంతో ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవాలి. పెరుగు నిమ్మకాయ నీటిని ముఖానికి అప్లై చేయాలి. కాసేపటి క్లీన్ చేసుకుంటే.. ఫేస్ డీప్ క్లీన్ అవుతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news